రాక్షసుడు రెండో రోజుల కలెక్షన్స్..

2014లో అల్లుడు శీనుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ వారి అబ్బాయి శ్రీనివాస్.. స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏ చిత్రం కూడా కమర్షియల్ హిట్ కొట్టలేకపోయింది. అయినాగానీ శ్రీను తో వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ సినిమా ‘రాట్చసన్’ రీమేక్ తో వచ్చాడు.

రమేష్ వర్మ డైరెక్ట్ చేయగా.. ఎ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. ఉత్కంఠభరింతగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ అన్ని ఏరియాల ఆడియన్స్ తో పాటు.. నైజాం జనాన్ని కూడా బాగానే ఆకట్టుకుంది. నైజాంలో కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లునే సాధించింది.

ఈ చిత్రం నైజాం ఏరియాలో శనివారం నాడు రూ .74 లక్షల షేర్ ను వసూలు చేసింది. మొత్తం మీద ఈ చిత్రం రెండు రోజులకు గానూ నైజాం షేర్ రూ .1.37 కోట్లు సాధించింది. పైగా ఈ రోజు ఆదివారం నాడు ముందస్తు బుకింగ్‌ లు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.