పుంజుకున్న రాక్షసుడు ..

గత కొంతకాలంగా హిట్ లేని బెల్లం కొండ శ్రీనివాస్ కు రాక్షసుడు మంచి హిట్ ఇచ్చింది. తమిళ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ..మొదటి రోజు మొదటి షో తోనే మంచి థ్రిలర్ మూవీ గా టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు పెద్దగా కలెక్షన్లు లేనప్పటికీ రెండు రోజు నుండి కలెక్షన్ల జోరు పెరుగుతూ వచ్చింది. వీకెండ్లో చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకే ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇక నైజాం ఏరియాలో మూడవ రోజు నాడు రూ . 8414843 లక్షల షేర్ ను వసూలు చేసి.. మూడు రోజులకు గానూ మొత్తం షేర్ రూ . 2,12,85,095 కోట్లు సాధించింది. నైజాంలో కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లునే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్నారు. ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాను నిర్మించగా..అనుపమ హీరోయిన్ గా నటించింది.