రాక్షసుడు తో శంకర్ పోటీ..

నిన్నటి వరకు రామ్ నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ జులై 12 న వస్తుందని అంత అనుకున్నారు..కానీ వరల్డ్ కప్ కారణంగా ఈ సినిమాను జులై 18 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఇస్మార్ట్ వాయిదా పడడంతో రాక్షసుడు కి ఇబ్బంది గా మారింది. ఎందుకంటే బెల్లం కొండ శ్రీనివాస్ – అనుపమ జంటగా నటించిన రాక్షసుడు చిత్రం జులై 18 న విడుదల కాబోతుంది.

ఈ చిత్రానికి పోటీ గా ఇప్పుడు రామ్ రావడం తో ఇద్దరి మధ్య క్లాష్ ఏర్పడినట్లు అయ్యింది. రెండు చిత్రాలు భిన్నమైన నేపధ్యం కలిగిన చిత్రాలు కావడంతో వీటి మధ్య పోటీ అంతగా ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాల వారు అంటున్న.. ఏదిఏమైనా ఈ రెండు చిత్రాల పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.