ఎక్కడయ్యా ..రాక్షసుడు హడావిడి..?

మరో రెండు రోజుల్లో సినిమా వస్తుందంటే ఆ హడావిడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు..ఏ ఛానల్ పెట్టిన ..ఏ రేడియో ఛానల్ పెట్టిన ఆ సినిమా వార్తలే చక్కర్లు కొడుతాయి..కానీ బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం ఎక్కడ హడావిడి లేదు. కనీసం ఈ సినిమా మరో రెండు రోజుల్లో వస్తుందని కూడా చాలామందికి తెలియని పరిస్థితి.

2014లో అల్లుడు శీనుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ వారి అబ్బాయి శ్రీనివాస్.. స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏ చిత్రం కూడా కమర్షియల్ హిట్ కొట్టలేకపోయింది. అయినాగానీ శ్రీను తో వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ సినిమా ‘రాట్చసన్’ రీమేక్ రాక్షసుడు లో నటించాడు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా.. ఎ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 02 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ఈ సినిమా హడావిడి మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. కనీసం ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సినిమాకైనా ప్రమోషన్ చాల అవసరం..సినిమా ఏ రేంజ్ లో ప్రమోషన్ చేస్తే ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఈ సినిమాలో ఎక్కడ ప్రమోషన్ కనిపించడం లేదు. ఇలాగైతే ఎలా అని సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. పోనీ పెద్ద హీరో అయితే ప్రమోషన్ పెద్దగా చేయకపోయినా పర్వాలేదు. కానీ శ్రీను ఒక్క హిట్ కూడా చెప్పుకునేది లేదు. అలాంటిది సినిమా ప్రమోషన్ చేయకపోతే ఎలా అని అడుగుతున్నారు. మరి సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో..టాక్ ఎలా ఉంటుందో చూడాలి.