రామ్ చరణ్ స్టేజ్ డాన్స్..

Ram-Charan-Land

బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే మన స్టార్స్ స్టేజి షోలకు దూరంగా ఉంటారు..భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆ స్టార్స్ డబ్బులు వెనకేసుకుంటుంటే మన స్టార్స్ మాత్రం సిగ్గుతో వారిని చూస్తే టైం పాస్ చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో మన హీరోలు కూడా రూట్ మార్చనట్లు కనిపిస్తుంది.

ఇటీవల ఐఫా ఉత్సవంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ చేసి మెప్పించాడు. అందుకోసం పారితోషకం కూడా భారీగానే తీసుకున్నాడని వార్తలు వినిపించాయి అనుకోండి. ఇప్పుడు మరోమారు చరణ్ అమెరికా లో స్టేజి మీద తన డ్యాన్సింగ్ టాలెంట్ చూపించబోతున్నాడు. ఇది ఓ మంచి పని కోసం చేపడుతున్న కార్యక్రమం. ఉగ్రవాదుల దాడుల్లో నష్టపోయిన కుటుంబాల్ని ఆదుకోవడం కోసం అమెరికాలో ఈ చారిటీ షో నిర్వహిస్తున్నారు. దీనికోసం చరణ్ అమెరికాకు వెళ్తున్నాడు. న్యూజెర్సీలోని పీఎన్సీ ఆర్ట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్టోబరు 15న ఈ షో జరగనుంది.