రామ్ చరణ్ సరసన శ్రీవల్లి..?

పుష్ప మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక..తాజాగా మరో మెగా హీరో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆర్ఆర్ఆర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేయబోతున్నాడు. దీని కోసం ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ను సెట్ చేసుకున్నాడు దర్శకుడు.

పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. ఈ ఏడాది సమ్మర్ తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు సమాచారం. అయితే ఇందులో రామ్ చరణ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.