దూసుకొస్తున్న ‘రామబాణం’..


మాచో స్టార్ గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక నేడు శ్రీరామనవమి సంద్రాభంగా మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసారు. పండుగ వాతావరణాన్ని ప్రతిభింభించేలా గుడి ఆవరణంలో పంచె కట్టు, నుదుటన బొట్టుతో గోపీచంద్, జగపతి బాబు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడిచొస్తున్న పోస్టర్ తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో అందంగా ఉంది.

ఈ పోస్టర్ తో పాటు ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. “ఆ రాముడుకి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరు ఉంటారు.. ఆ ఇద్దరినీ కలిపితే నేను” అనే బలమైన మాటతో రూపొందించిన వీడియో ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమా మే 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.