నిర్మాతగా రష్మిక..?

గీత గోవిందం , డియర్ కామ్రేడ్ , దేవదాస్ , సరిలేరు నీకెవ్వరూ , భీష్మ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక ..అతి తక్కువ టైంలోనే ఐటీ అధికారుల దృష్టి లో పడింది. చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ బ్యాంకు బాలన్స్ గట్టిగా ఉండడం తో ఆమె ఇంటి ఫై , ఆఫీస్ లపై ఐటీ అధికారులు రైడ్స్ చేసారు.

ఈ రైడ్స్ నేపథ్యంలో రష్మిక ప్రొడ్యూసర్ కావాలని డిసైడ్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐటీ దాడుల తర్వాత ఇన్‌కమ్ ఎందులోనయినా ఇన్వెస్ట్ చేయాలని అనుకున్న రష్మిక సినిమాల్లో పెడితేనే బాగుంటుందని భావిస్తోందట. అందుకే యువ రచయితలకి మంచి కథలుంటే పంపమంటూ పిలుపిచ్చింది. రష్మిక ఈ విషయంలో సీరియస్‌గానే వుందనిపిస్తోంది. సాధారణంగా హీరోయిన్లు నిర్మాణం జోలికి వెళ్లరు. వెళ్లిన కొద్ది మందికి కూడా చేదు అనుభవాలు ఎదురవడంతో స్టార్ హీరోయిన్లు సయితం ఆచి తూచి అడుగులేస్తుంటారు. సమంత, కాజల్ లాంటి వాళ్లు సొంతంగా నిర్మాణం చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ ఇంతవరకు ధైర్యం చేయలేదు. మరి ఇప్పుడు రష్మిక నిర్మాణ అడుగులు వేయాలని భావిస్తుంది. ఇది ఈమెకు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.