రష్మికని ఏడిపించిన అభిమాని


రష్మిక .. ఆదివారం 24వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెను విష్‌ చేస్తూ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రష్మిక సినిమాల్లోని సీన్లను కలిపి ఓ వీడియోగా రూపొందించారు. రష్మికది స్ఫూర్తిదాయకమైన జీవితమని, ఈ వీడియోను పూర్తి గౌరవంతో ఎడిట్‌ చేశానని అన్నారు. దీన్ని చూసిన రష్మిక కన్నీరుపెట్టుకున్నారు.

‘నువ్వు నన్ను భావోద్వేగానికి గురి చేశావు. నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వీడియోను బాగా ఎడిట్‌ చేశావు. ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం జోరుమీదున్న కథానాయిక రష్మిక. ‘ఛలో’, ‘గీతగోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’, సరిలేరు వంటి సినిమాలతో యువతను ఆకట్టుకుంది