వెంకీమామ తో మరో యంగ్ బ్యూటీ..


టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం ‘సైంధవ్’. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వెంకీ మామ నుంచి అయితే పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే కొద్దిరోజుల క్రితమే జెర్సీ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ ఈ సినిమాలో నటిస్తుందని పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలియచేసిన మేకర్స్.. ఇక తాజాగా రుహానీ శర్మ కూడా ఈసినిమాలో కీలక పాత్ర చేస్తున్నట్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా డాక్టర్ రేణు అనే పాత్రలో రుహానీ శర్మ కనిపించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వెంకటేష్ కు ప్రతినాయకుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నాడు.