రూలర్ ఫస్ట్ షో ఏ టైంకు పడుతుందో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ , వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లు గా.. భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్రకాష్ రాజ్ తదితరలు కీలక పాత్రల్లో.. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మించిన చిత్రం రూలర్. సీనియర్ దర్శకులు కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా రేపు( డిసెంబర్ 20 న ) థియేటర్స్ లోకి గ్రాండ్ గా రాబోతుంది.

చిత్ర ట్రైలర్ , స్టిల్స్ , ప్రమోషన్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయడం తో ఈ సినిమాను మొదటి షో ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర మొదటి షో ను రేపు ఉదయం 8:33 నిమిషాలకు ప్రదర్శించాలని బాలకృష్ణ ఆదేశించారట.