రూలర్ టాక్ అప్పుడే బయటకొచ్చి ఫ్యాన్స్ ను షాక్ లో పడేసింది..

నందమూరి బాలకృష్ణ , వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లు గా.. భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్రకాష్ రాజ్ తదితరలు కీలక పాత్రల్లో.. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మించిన చిత్రం రూలర్. సీనియర్ దర్శకులు కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న థియేటర్స్ లోకి గ్రాండ్ గా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ట్రైలర్ , సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా..కొత్తదనం ఏమాత్రం లేదని బాలయ్య గత చిత్రాల మాదిరిగానే ఉన్నాయని అంత మాట్లాడుకుంటున్న సమయంలో ఈ చిత్ర ఇన్ సైడ్ టాక్ బయటకొచ్చి ఫ్యాన్స్ ను షాక్ లో పడేస్తుంది.

ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా ఫెయిల్‌ కావటంతో బాలయ్య అభిమానులు రూలర్ ఫై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు ఆశలుగానే మిగిలిపోయేలా ఉన్నాయని అంటున్నారు. సినిమా రొటీన్‌ బాలకృష్ణ సినిమాలా ఏ మాత్రం కొత్తదనం లేకుండా సాగుతుందట. యాక్షన్‌, పంచ్‌ డైలాగ్‌లు, హీరోయిన్లతో రొమాన్స్‌ లాంటి అంశాలు అన్నీ గతంలో బాలయ్య సినిమాల్లో చాలా సార్లు చూసినట్టుగానే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజమా..కదా అనేది క్లారిటీ లేనప్పటికీ అభిమానులు మాత్రం ఖంగారు పడుతున్నారు.