రూలర్ మూవీ టాక్..

ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు ప్లాప్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ నుండి వచ్చిన చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు (శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ లో బాలకృష్ణ కు జోడిగా సోనాల్ చౌహాన్‌, వేదిక లు నటించగా.. సీ కళ్యాణ్ సినిమాని నిర్మించారు. జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. చిరంతన్‌ భట్ సంగీతమందించాడు.

గతంలో బాలకృష్ణ – కేయస్‌ రవికుమార్‌ కలయికలో వచ్చిన జైసింహా వచ్చి హిట్ కాగా..ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో రూలర్ రావడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు..మరి ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉందా..జై సింహ తర్వాత మరో హిట్ పడినట్లేనా..మరి సినిమా చూసిన అభిమానులు , ప్రేక్షకులు ఏమంటున్నారనేది ఇప్పుడు చూద్దాం.

సినిమా చూసిన ప్రేక్షకులు కాస్త మిక్సెడ్ టాక్ ఇస్తున్నారు..అభిమానులు బాలయ్య బాబు ఎనర్జీ సూపర్‌ .. ఎలివేషన్‌ సీన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ కేక.. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే `పడతాడు` పాటలో బాలయ్య కుమ్మేసాడని అభిమానులు చెపుతున్నారు. ఇతర ప్రేక్షకులు మాత్రం అంత లేదనే విధంగా చెపుతున్నారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగినా సెకండ్‌ హాఫ్‌ దెబ్బతీసిందని అంటున్నారు. రొటీన్‌ స్టోరి, టేకింగ్‌లతో డైరెక్టర్ బోర్‌ కొట్టించాడని..నిడివి కూడా ఎక్కువ గా ఉందని చెపుతున్నారు. మరి పూర్తి రివ్యూ చూడాలంటే కాసేపు ఆగాల్సిందే.