‘సాహో’ నాలుగు రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

ప్రభాస్ నటించిన సాహో చిత్ర సందడి నాల్గో రోజు తగ్గినట్లు తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడం తో జనాలు భారీ అంచనాలు పెట్టుకొని మూడు రోజుల పాటు హౌస్ ఫుల్ అయ్యేలా టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ సినిమా అనుకున్న రీతిలో ఆకట్టుకోలేకపోవడం తో నాల్గో రోజు నుండి సాహో సందడి తగ్గింది.

సోమవారం బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద రూ. 14.20 కోట్ల గ్రాస్ వసూలైనట్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ‘సాహో’ హిందీ వర్షన్ ఓపెనింగ్ డే అంటే శుక్రవారం రూ.24.40 కోట్ల గ్రాస్ రాబట్టింది. శనివారం రూ.25.20 కోట్లు, ఆదివారం రూ.29.48 కోట్లు వసూలు చేసింది. కానీ, సోమవారం మాత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. మొత్తంగా హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో రూ. 93.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ ఏకంగా రూ.188 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ నాల్గు రోజుల్లో మాత్రం షేర్ 67 కోట్ల 35 లక్షల రూపాయలు సాధించింది. మరి మిగిలిన రన్‌తో ఆ రేంజ్ ఎమౌంట్ రాబట్టడం చాల కష్టం.