‘సాహో’ క్లోజింగ్ కలెక్షన్స్..

ప్రభాస్ – సుజిత్ కలయికలో ఆగస్టు 30 న వచ్చిన సాహో చిత్రం అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. దీంతో నాల్గు వారాలకే క్లోజింగ్ కలెక్షన్స్ తో క్లోజ్ అయ్యింది.

నైజాం —రూ.30 కోట్ల షేర్
సీడెడ్‌ — రూ.12 కోట్ల షేర్
ఉత్తరాంధ్ర రూ.11 కోట్ల షేర్
తూర్పు గోదావరి జిల్లాలో — రూ.7.5 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో– రూ.6 కోట్లు
గుంటూరు జిల్లాలో —రూ.8 కోట్లు
కృష్ణా జిల్లాలో — రూ.5.5 కోట్లు
నెల్లూరు జిల్లాలో— రూ.4.5 కోట్లు వసూలు చేసింది.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.84 కోట్ల షేర్ సాధించినట్టు సమాచారం.

కర్ణాటకలో — రూ.16.5 కోట్లు
తమిళ వెర్షన్‌లో — రూ.5.50 కోట్లు
మలయాళంలో — రూ.1.50 కోట్లు
అమెరికాలో — రూ.14 కోట్లు
మిగతా దేశాల్లో — రూ.18 కోట్లు వసూలు చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా రూ.270 కోట్లకు అమ్మినా ఈ సినిమా మొత్తంగా రూ.220 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ మాత్రం రూ.420 కోట్లకు పైగా రాబట్టింది. మొత్తంగా అన్ని ప్రాంతాలకు కలిసి డిస్ట్రిబ్యూటర్స్‌కు రూ.50 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. తెలుగులో మాత్రం 120 కోట్ల బిజినెస్ చేస్తే.. 80 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. హిందీలో రూ.100 కోట్ల బిజినెస్ చేస్తే.. రూ.150 కోట్లకు వసూళ్లు రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే.. సాహో ఒక్క బాలీవుడ్‌లో మాత్రమే సూపర్ సక్సెస్ అనే చెప్పాలి.