ప్రభాస్‌ సక్సెస్‌.. సాహో ఫ్లాప్‌

బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇండియా మొత్తం ఆయనకు ఫ్యాన్స్‌ ఏర్పడ్డారు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ స్టార్‌ హీరోకు కూడా లేని క్రేజ్‌ బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ దక్కించుకున్నాడు. తనకు వచ్చిన క్రేజ్‌ను తగ్గించుకోకుండా పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో బాహుబలిని మించిన బడ్జెట్‌తో సాహో చిత్రాన్ని చేయడం జరిగింది. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సాహో చిత్రం మొన్న విడుదలైంది. సినిమాకు 175 కోట్ల వసూళ్లు నాలుగు రోజుల్లో నమోదు అయ్యాయి.

మొదటి నాలుగు రోజుల్లో కేవలం స్టార్‌ హీరోల సినిమాలకు మాత్రమే ఈ స్థాయిలో వసూళ్లు నమోదు అవుతాయి. సల్మాన్‌ ఖాన్‌ హిట్‌ సినిమాలు కూడా ఈ స్థాయిలో గతంలో వసూళ్లను దక్కించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అలాంటిది ప్రభాస్‌ తన క్రేజ్‌తో ఏకంగా నాలుగు రోజుల్లో 175 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. కాని సాహో సినిమా ఫ్లాప్‌ అవ్వడం వల్ల లాంగ్‌ రన్‌లో 200 కోట్ల నుండి 250 కోట్ల వరకు రాబట్టడం కష్టం అయ్యింది. ప్రభాస్‌ తనకున్న స్టార్‌డంతో అంత వరకు రాబట్టగలిగారు. ఇక సినిమాల్లో స్టఫ్‌ లేనిది ప్రభాస్‌ మాత్రం ఏం చేయగలడు చెప్పండి.