‘సాహో’ ఎన్టీఆర్‌, చరణ్‌ల రికార్డు బ్రేక్‌ చేయలేదు

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం మొదటి వారం రోజులను పూర్తి చేసుకుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన సాహో చిత్రం దాదాపుగా 400 కోట్ల గ్రాస్‌ను అయితే కలెక్ట్‌ చేసింది కాని సీడెడ్‌లో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ల పేరున ఉన్న అరుదైన రికార్డులను మాత్రం బ్రేక్‌ చేయడంలో విఫలం అయ్యింది. అత్యధిక థియేటర్లలో ఈ చిత్రంను విడుదల చేసిన కూడా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు వచ్చిన నెగటివ్‌ టాక్‌ కారణంగా మినిమం రికార్డులను దక్కించుకోలేక పోయిందని టాక్‌ వినిపస్తుంది.

ఓవర్సీస్‌లో నాన్‌ బాహుబలి రికార్డులను దక్కించుకోలేక పోయిన సాహో చిత్రం సీడెడ్‌ లో రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’ మొదటి రోజు 7.62 కోట్ల కలెక్షన్స్‌ను దాటలేక పోయింది. ఇక సీడెడ్‌లో మొదటి వారంలో అరవింద సమేత చిత్రంతో ఎన్టీఆర్‌ ఏకంగా 13.08 కోట్లను రాబట్టాడు. ఆ చిత్రం సాధించిన రికార్డును కూడా సాహో సాధించలేక పోయింది. ప్రస్తుతం సాహో చిత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే లాంగ్‌ రన్‌లో 500 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని అనిపిస్తుంది.