ఫస్ట్‌వీక్‌ ‘సాహో’ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్‌

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. సినిమాకు పూర్తిగా నెగటివ్‌ టాక్‌ వచ్చింది. అయినా కూడా మొదటి వారంలో ఊహించని విధంగా వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం రోజుల్లో దాదాపుగా 400 కోట్ల వరకు గ్రాస్‌ వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ చిత్రం ఏకంగా 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టింది. బాహుబలి చిత్రం తర్వాత ఆ స్థాయిలో షేర్‌ను రాబట్టిన చిత్రంగా సాహో నిలిచింది.

సాహో మొదటి వారం కలెక్షన్స్‌ :

నైజాం : 26 కోట్లు

సీడెడ్‌ : 11 కోట్లు

ఉత్తరాంధ్ర : 9 కోట్లు

కృష్ణ : 4 కోట్లు

గుంటూరు : 8 కోట్లు

ఈస్ట్‌ : 9 కోట్లు

వెస్ట్‌ : 5 కోట్లు

నెల్లూరు : 4 కోట్లు

మొత్తం : 75 కోట్లు (దాదాపుగా)