రిలీజ్ కు ముందే సాహో గేమ్ ..

యంగ్ రెబల్ స్టార్ అభిమానులే కాదు..సినీ ప్రేక్షకులు , సినీ ప్రముఖులు సైతం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం సాహో. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే బయటకు వస్తున్న ఒక్కో పోస్టర్..సాంగ్ ..అప్డేట్ లు ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేస్తుండగా..తాజాగా ప్రభాస్ అభిమానులకు మరో తీపి కబురు అందించారు.

‘సాహో ది గేమ్’ పేరుతో ఓ వీడియో గేమ్ ని విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన తెలియజేశారు. ఈ గేమ్ ని ప్రఖ్యాత గేమ్ డెవలపింగ్ సంస్థ ఫిక్స లాట్ ల్యాబ్స్ డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ గేమ్ ఎప్పటినుండి అందుబాటులోకి రానుందన్న విషయాలు తెలియాల్సివుంది. సినిమాలో ఎలాగైతే యాక్షన్ ఉంటుందో..ఈ గేమ్ కూడా అదే తరహా ఉంటుంది కావొచ్చు అని అంత భావిస్తున్నారు.