‘సాహో’ హిందీ బయ్యర్స్‌ పరిస్థితి ఏంటీ?

ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో ఆల్‌ ఇండియా స్టార్‌గా పేరు దక్కించుకున్నాడు. అలాంటి క్రేజ్‌ను దక్కించుకున్న హీరో 350 కోట్లతో సినిమా చేశాడు అంటే అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. సాహో చిత్రానికి ఏకంగా 350 కోట్లు పెట్టి తీయడం వల్ల సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అని అంతా అనుకున్నారు. అందుకే ఈ చిత్రం హిందీలో ఏకంగా 75 కోట్ల మార్కెట్‌ను చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను ఏకంగా 75 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. సినిమాకు ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఆ మొత్తం వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

సాహో చిత్రం హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో పాటు భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉండటం వల్ల బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. మొదటి అయిదు రోజుల్లోనే 105 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టింది. ప్రస్తుతంకు 60 కోట్ల షేర్‌తో ఉన్నట్లుగా తెలుస్తోంది. లాంగ్‌ రన్‌లో ఈజీగానే బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకునే ఛాన్స్‌ ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బయ్యర్ల పరిస్థితి కాస్త కష్టంగానే ఉంది.