‘సాహో’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తారా..?

ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన సాహో ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. టాక్ నెగిటివ్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బ్లాక్ బస్టర్ రేంజ్ లో వసూళ్లు అవుతున్నాయి. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం వీకెండ్ మొత్తం కూడా అదే ఊపు కొనసాగించింది. ప్రస్తుతం అందించిన సమాచారం మేరకు మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. తెలుగు, హిందీ అని తేడా లేకుండా అన్ని చోట్లా ఇప్పుడు సాహో రికార్డులు కొనసాగుతున్నాయి. ఇక హిందీ విషయానికి వస్తే అక్కడి సినీ విశేలేషకులు అట్టర్ ప్లాప్ అని తేల్చేసిన కలెక్షన్లు మాత్రం మతి పొగుడుతున్నాయి.

తొలిరోజు 24 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు 26.. మూడో రోజు 29 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. నాలుగో రోజు వినాయక చవితి సెలవు ఉండటంతో మరో 30 కోట్ల వరకు వచ్చినట్లు లెక్కలు కడుతున్నారు. ఇక తెలుగులో కూడా నైజాంలో మూడు రోజుల్లోనే 20 కోట్ల షేర్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వర్షన్ ఇప్పటికే 60 కోట్లు దాటిపోయింది.