Salaar : కాటేరమ్మ కొడుకు నెట్‌ఫ్లిక్స్ కి వచ్చేస్తున్నాడు..!


ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘సలార్’. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో చాలా కాలం తరువాత ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టాడు. మరి ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘సలార్’ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంస్థ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ‘సలార్’ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది.

“కాటేరమ్మ కొడుకు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కి వచ్చేస్తున్నాడు. యా యా యా యా! ‘సలార్’ తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో జనవరి 20 న నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది” అంటూ అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు. మొత్తానికి మరికొద్ది గంటల్లోనే అంటే ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచే సలార్ స్ట్రీమింగ్ కానుంది. ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మించారు. ఇక శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. మలయాళం స్టార్ పృథీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి, బాబీ సింహ కీలక పాత్రల్లో నటించారు.