Salaar Trailer : ‘సలార్’ ట్రైలర్ టాక్.. ఇక విధ్వంసమే


ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా ‘సలార్’. ఈ చిత్రానికి కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ‘సలార్’ మూవీ డిసెంబర్ 22, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసారు మేకర్స్.

‘సలార్’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ భారీ ట్రైలర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ను కీలకం గా చూపించారు. అదే విధంగా పృథ్వి రాజ్ మరియు ప్రభాస్ ల స్నేహం ను కూడా బాగానే ఎలివేట్ చేశారు. అంతేకాదు ప్రభాస్ విధ్వంసం మామూలుగా లేదు. విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ట్రైలర్ ను తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో రిలీజ్ చేసారు.

ఇక శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హోంబళే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం లో జగపతి బాబు, పృధ్వీ రాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.