టాలీవుడ్ లో ఇప్పటికి స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున సమంత పేరే చెప్తారు సినీ లవర్స్. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకొని దాన్ని నిలుపుకుంది. ఆ తరువాత నాగ చైతన్య తో పెళ్లి, ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కొద్ది కాలానికే విడాకులు తీసుకుంది. ఆ తరువాత తన కెరీర్ లో స్పీడ్ పెంచింది. ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం, యశోద, విజయ్ దేవరకొండతో కలిసి మరొక సినిమా ఉన్నాయి. అంతేకాక హాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయబోతుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు అగ్రతారల జాబితాలో చేరి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కానీ ఆమె కెరీర్ ప్రారంభంలో సంపాదన తెలుసా కేవలం రూ.500. నా మొదటి సంపాదన రూ.500. ఒక హోటల్లో జరిగిన సమావేశానికి హోస్ట్‌గా వ్యవహరించినందుకు నాకు ఆ డబ్బు ఇచ్చారని సమంత తెలిపింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేసిన ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.