సమంతా… తమన్నా… కాజల్… ఎవరు నంబర్ 1 ???

Samantha Kajal Tamanna who is number 1 in Tollywood Heroinesఎవరెంత చెప్పుకున్నా తెలుగు సినిమా అంటేనే… హీరోల కోసం! కధానాయిక గ్లామర్ పెంచడానికి పనికొస్తుందంతే. కానీ ఆ గ్లామరే ఇప్పటి సినిమాకి కావలసిన ప్రధాన ముడి సరుకుగా మారిపోయింది. తెర అందంగా కనిపిస్తే… రీలు రీలుకి కనువిందు చేస్తే మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది? అందుకే సినిమా హీరో చుట్టూ తెరిగినా హీరో మాత్రం కధానాయిక వెంట ప్రదక్షిణాలు చేయాల్సిందే! అప్పుడే గ్లామర్ పంట పండుద్ది. అందుకే ఈ విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. హీరోకి తగిన నాయికను వెదికి పట్టుకుంటే… సగం హిట్టు కొట్టినట్టే అని భావిస్తుంటారు. అప్పుడప్పుడూ కొత్త కధానాయికల కోసం అన్వేషణ సాగించినా… స్టార్ హీరోల సినిమా అనేసరికి.. ఆ స్థాయి వున్న నాయికనే ఎంచుకుంటారు. 2012 లో పేరున్న భామల హవానే ఎక్కువ నడిచింది. ఎప్పటిలాగే సమంత, కాజల్, తమన్నా ఎక్కువ సినిమాలు దక్కించుకున్నారు. తాప్సి, అమలాపాల్, దీక్షాసేద్, రిచా గంగోపాధ్యాయ లాంటి ద్వితీయ శ్రేణి భామలకూ సినిమాలు దక్కాయి. అయితే… 2012 ఎవరికి ఇష్టంగా, మరెవరికి కష్టంగా గడిచింది?

Tollywood Heroinesగత ఏడాదితో పోల్చుకుంటే… ఈసారి భామల జోరు ఎక్కువగానేవుంది. కొత్త తరం తారలతో అనుష్క, ఇలియానా, త్రిష, శ్రియ, నయనతార లాంటి సీనియర్లు పోటీ పడ్డారు. సినిమాలు లేవు అనుకుంటున్న తరుణంలో త్రిష ఈ ఏడాది 2 సినిమాలు (బాడీగార్డ్, దమ్ము) దక్కించుకుంది. స్వీటీ ‘ఢమరుకం’ లో మెరిసింది. ‘కృష్ణం వందే జగద్గురుం’లో మంచి నటనతో నయనతార మరోసారి మెప్పించింది. అయితే ఆ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు. ఇలియానా ‘జులాయి’తో సందడి చేసింది. శ్రియ ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’లో కనిపించింది. అయితే…. ఇలియానా కు తప్ప మరెవరికీ క్లీన్ హిట్ దొరకలేదు. రెండు సినిమాలు దక్కించుకున్నా వాటిలో త్రిష చేయడానికి ఏమీ లేదు. ‘ఢమరుకం’ సినిమా బాగానే వున్నా… అనుష్క ఫోకస్ కాలేదు. శ్రియ గురించి పట్టించుకునే నాధుడే లేడు. ఇలా స్టార్ భామలకు ఈ ఏడాది కొచెం కష్టం గానే గడిచింది.

Tollywood Heroines1అవకాశాలు రాలేదు… రాలేదు అంటారు గానీ… వస్తే సద్వినియోగం చేసుకోవాలి కదా? ఈ విషయంలో కొంతమంది విఫలమయ్యారు. ముఖ్యంగా రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేద్, పార్వతి మెల్టన్ ల గురించి చెప్పుకోవాలి. రిచాది ఐరన్ లెగ్ అని… పరిశ్రమ ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం తన వంతు కృషి చేస్తూనే ఉందీ అమ్మడు. ‘సారొచ్చారు’ సినిమాలో రవితేజ పక్కన నటించే అవకాశం అందుకుంది. కానీ ఆమె మొఖంలో ఒక్క భావన పలికితే ఒట్టు. ఆ సినిమా పరాజయంలో రిచాది కీలక పాత్ర, అందరికంటే ఎక్కువ వాటా తీసేసుకుంది. పార్వతి మెల్టన్ కి రెండు సినిమాలు దక్కాయి. ‘శ్రీమన్నారాయణ’లో మరీ బక్కగా… అందులోనే బాలయ్య కామెంట్ చేసినట్టు ‘బొంగుకు ఫాంటూ షర్టూ వేసినట్టు’ కనిపించింది. ఇక.. ‘యమహో యమః’లో అయితే మరీ ఘోరం. నెల రోజుల పాటు లంకణం చేసి.. కెమెరా ముందుకు వచ్చినట్టు వుంది. ఆ రెండు సినిమాలూ పార్వతి కెరీర్ కి ఏమాత్రం ఉపయోగ పడవు. ‘రెబల్’లో దీక్షాసేద్ కి నటించే అవకాశం దక్కలేదు. ‘మొగుడు’ సినిమాలో తాప్సి గొంతు చించుకుని అరిచి గీ పెట్టినా ఎవరూ చెవికెక్కించుకొలెదు. ‘దరువు’ కుడా తాప్సి కెరీక్ కి బరువే! ఆవిధంగా కొంతమంది ద్వితీయ శ్రేణి నాయికలకు 2012 మింగుడు పడని ఫలితాలను ఇచ్చింది.

Tollywood Heroines22011 లాగే, 2012 సమంత కి బాగా కలిసొచ్చింది. ‘ఈగ’ లాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆరోగ్య కారణాల వల్ల 2 నెలలు షూటింగ్ లకు దూరమైనా… సినిమాలను మాత్రం కాపాడుకుంది. ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ లో మరోసారి తన అత్యుత్తమ నటన బయట పెట్టింది. కొత్తగా మరి కొన్ని సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. శ్రుతి హాసన్ కి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న విజయం ‘గబ్బర్ సింగ్’తో దక్కింది. ఈ సినిమా అటూ ఇటూ అయితే తెలుగు సీమలో శ్రుతి స్థానం గల్లంతు అయ్యేది. ఈ విజయాన్ని ఆసరాగా చేసుకుని ఈ కమల్ కూతురు రెచ్చిపోయింది. వరుసగా అవకాశాలు అందుకుంది. కాజల్ కి మిశ్రమ ఫలితాలు దక్కాయి. ‘బిజినెస్ మెన్’తో ఈ ఏడాది ఘనంగా ప్రారంభించింది. డబ్బింగ్ బొమ్మ ‘బ్రదర్స్’, ‘సారొచ్చారు’ ఫ్లాప్స్ ఖాతాలో చేరాయి. ‘తుపాకి’ బాగానే ఆడింది. తమన్నా పరిస్థితీ అంతే. పెద్ద హీరోలతో నటించినా అవేవీ హిట్ బాట పట్టలేదు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లో మగ రాయుడిగా కనిపించింది. ఆ గెటప్ తమ్మూ కి సూట్ కాలేదు. ‘రెబల్’లో ఎప్పుడూ లేని విధంగా ఓవర్ యాక్షన్ చేసింది. అమలాపాల్ ‘లవ్ ఫెయిల్యూర్’ తో ఓ కమర్షియల్ హిట్ దక్కించుకుంది.

Tollywood Heroines3హిట్, ఫ్లాప్స్ పక్కన పెడితే… కధానాయికలు అవకాశాలను మాత్రం, ఫలితాలకు అతీతంగా అందుకోగలుగుతున్నారు. తమన్నా, సమంత, కాజల్… వీళ్ళ కాల్షీట్లు ఎప్పుడూ హాట్ కేకులే. అంతమాత్రాన వీళ్ళే దిక్కు అని కాదు. అవసరమైతే బాలీవుడ్ నుంచో, హాలీవుడ్ నుంచో భామలను దిగుమతి చేసుకోవడానికి మన దర్శక నిర్మాతలు వెనకడుగు వేయరు. ఈ విషయం గుర్తు పెట్టుకుంటే అందరికీ మంచిది. ఓ హిట్ కొట్టగానే పారితోషికం పెంచేయడం లో ముందుండే భామలు… ఓ ఫ్లాప్ చూడగానే తమ తప్పులు సరిదిద్దుకుని నడచుకోవాలి. ఈ మార్పు 2013లో అయినా చూడాలని ఆశిద్దాం.