సరిలేరు రేటింగ్ ఎంతో తెలుసా..?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్‌ రాజు సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై నిర్మించబడిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 11న ) భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక మహేష్ కు జోడిగా నటించగా..లేడి సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం తో ఈ సినిమాను చూసేందుకు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుండే షోస్ మొదలు కావడం తో ఎక్కడ చూసిన అభిమానుల సందడి రాత్రి నుండే మొదలు అయ్యింది. ఇక సినిమా చూసిన వారు సోషల్ మీడియా లో సినిమా గురించి ఓ రేంజ్ లో చెపుతూ సినిమాకు 4 /5 రేటింగ్ ఇస్తున్నారు. అలాగే సినిమాలో నటించిన స్టార్స్ కు సైతం అదే రేంజ్ లో స్టార్ రేటింగ్ ఇస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నారు.

మహేష్ బాబుకి 4 రేటింగ్ ఇచ్చారు. అలాగే.. వీఎఫ్‌ఎక్స్‌కి 4, యాక్షన్‌కు 4, అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభకు 4, సహాయ నటులకు 4, ఎడిటింగ్‌కు 3, స్క్రీన్ ప్లేకు 4, సినిమాటోగ్రఫీకి 4, నేపథ్య సంగీతానికి 3.5, కథకు 4, హీరోయిన్ రష్మికకు 3, ప్రకాష్ రాజ్‌కు 3 చొప్పున రేటింగ్స్ ఇచ్చారు.

ఓవరాల్ గా మాత్రం సినిమా విడుదలైన ప్రతి చోట ఒకటే మాట బొమ్మ సూపర్ హిట్..సంక్రాంతి ki అల్లుడు వచ్చాడు అని.