సరిలేరు టైటిల్ ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ టీజర్ ..సాంగ్స్ తో సినిమా ఫై మరింత అంచనాలు పెరుగగా తాజాగా చిత్ర టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.

సైనికుడి గొప్పతనం, త్యాగాలని వివరిస్తూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించగా… శంకర్ మహాదేవన్ పాడారు. ఈ మూవీ లో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపిస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.