‘సీటీమార్’ కే ఫిక్స్ అయినా గోపీచంద్…

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌..తమన్నా జంటగా సంపత్ నంది డైరెక్షన్లో స్పోర్ట్స్ నేపధ్య కథ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో గోపిచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తుండగా.. తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు.

ముందు నుండి అంత అనుకుంటున్నట్లే ఈ చిత్రానికి ‘సీటీమార్’ అనే పేరును ఫిక్స్ చేసారు. ఈ మూవీ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండటం, మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో చిత్రానికి ఈ టైటిల్ బాగా యాప్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించారు. ఈ సినిమాను ‘యు టర్న్’ నిర్మాత శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయకిగా నటిస్తోంది. భూమిక, రావురమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.