వ‌న్‌కి సీక్వెల్ ఉందా?

mahesh babu oneవిడుద‌ల‌కు ముందు ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించింది `1`. విడుద‌ల త‌ర‌వాత కూడా ఈ సినిమా గురించి అంత‌గానే మాట్లాడుకొంటున్నారు. ఇది మేధావుల సినిమా అని కొంత‌మంది స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ఇంకొంత‌మంది ఎందుకీ గంద‌ర‌గోళం అన్నారు. కానీ సుకుమార్ మాత్రం ఈ సినిమాపై రోజు రోజుకీ ప్రేమ పెంచుకొంటూనే ఉన్నారు. ఒక‌వేళ త‌న‌కు అవ‌కాశం ఇస్తే.. ఆర్య 2 లానే, వ‌న్‌కి సీక్వెల్ కూడా తీస్తా అంటున్నారు. దానికి 1+1 అనే టైటిల్ పెడ‌తార‌ట‌. మ‌రి సుకుమార్ ఆలోచ‌న ఫ‌లిస్తుందా? మ‌హేష్ ఈ సీక్వెల్‌కి ఒప్పుకొంటాడా?? అనేదే పెద్ద ప్రశ్న‌.