షారుఖ్ కు గాయాలు

2బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గాయపడ్డాడు. తన తాజా చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ షూటింగ్ లో బాగంగా ఓ షాట్ చిత్రీకరణ జరుగుతుండగా షారుక్ కు స్వల్ప గాయాలయ్యాయి. గాయ పడ్డ షారుక్ ను వెంటనే నానావతి హాస్పిటల్ కు తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కంగారు పడాల్సిన పని లేదని, స్వల్ప గాయాలేనని, షారుక్ వెంటనే కోలుకుంటాడని తెలిపారు.

1ఇక ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం వివరాల్లోకి వెళితే…షారుక్ లీడ్ రోల్ లో ఫరా ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కామెడీ, రొమాన్స్, రిలేషన్ షిప్ లాంటి ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా హ్యాపీ న్యూ ఇయర్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.