‘జెర్సీ’ వల్ల 25 కుట్లు వేయించుకున్న షాహిద్

తెలుగు లో సూపర్ హిట్ సాధించిన జెర్సీ చిత్ర..హిందీ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా అల్లు అరవింద్ గీతా ఆర్స్ట్ పై హిందీలో నిర్మిస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇది క్రికెట్ నేపథ్యంలో సినిమా కావడంతో హీరో చాలా సాహసాలే చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని షాహిద్ కపూర్ తాజాగా వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం తాను ఎంతగా కష్టపడ్డాడో షాహిద్ రివీల్ చేసారు. సినిమా కోసం ప్రాక్టీస్ లో గాయపడ్డానని తెలిపారు. క్రికెట్ సాధన చేస్తున్నప్పుడు బౌలర్ వేసిన బంతి పెదవికి బలంగా తాకింది. దీంతో తీవ్ర గాయం అయ్యింది. దీంతో 25 కుట్లు పడ్డాయట. మళ్లీ జీవితంలో పెదవి కదపడం కష్టమని భావించాడుట. కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. దాదాపు రెండు నెలలు పాటు షూటింగ్ కూడా ఆపేసారుట. ఆ సమయంలో దర్శకుడు మిగతా నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించారని షాహిద్ తెలిపారు.