షారుఖ్ వరల్డ్ టూర్

sharuk
బాలీవుడ్ బాద్ష షారుఖ్ ఖాన్ ప్రపంచాన్ని చుట్టేయాలని భావిస్తున్నాడు. తన కొత్త చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ కోసం. ఈ సినిమా ప్రచారం కోసమే ఈ ప్రపంచ పర్యటన. ఈ యాత్రకి ‘స్లామ్’ అనే పేరు పెట్టారు. సెప్టెంబరు 19న ఈ టూర్ హోస్టన్‌లో మొదలై న్యూ జెర్సీ, టొరంటో, చికాగో తదితర దేశాల్లో సాగుతుంది. ”నా అభిమానుల కోసమే మా చిత్ర బృందం ఈ ప్రపంచ యాత్ర చేస్తుంది”అని షారుఖ్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ తదితరులు నటించారు. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫరాఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు