పవన్ పక్కన మళ్లీ జున్నులాంటి పిల్ల

pawan
‘గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల’ అంటూ శ్రుతి హాసన్ పై ఓ పాట అందుకుంటుంటాడు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ లో. ఇప్పుడీ జున్నులాంటి పిల్ల మరోసారి పవన్ తో ఆడి పాడటం ఫిక్స్ అయ్యింది. పవన్ కళ్యాణ్- ఎస్‌.జె.సూర్య కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో శ్రుతిని హీరోయిన్ గా పరిశిలీస్తున్నట్లు తెలుగుమిర్చి ఇదివరకే తెలియజేసింది. ఇప్పుడు దీనిపై ఆధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. . గ‌బ్బ‌ర్‌సింగ్‌లో తొలిసారి జోడీ క‌ట్టారు ప‌వ‌న్‌, శ్రుతి. ఆ సినిమా సూప‌ర్ హిట్ట‌య్యింది. గ‌బ్బ‌ర్‌సింగ్‌తోనే శ్రుతి జాత‌కం మారింది. ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ అయ్యింది గబ్బర్ తోనే. ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్ ప‌క్క‌న చిందేసే ఛాన్స్ ద‌క్కించుకొంది. ప‌వ‌న్‌తో రెండోసారి న‌టించే అవ‌కాశం రావ‌డంతో శ్రుతి ఎగిరిగంతేస్తోందదిప్పుడు శ్రుతి.