సాహో బ్యూటీ డిమాండ్ మాములు లేదు కదా..

మెగా ప్రొడ్యూసర్ గా గుర్తింపు ఉన్న అల్లు అరవింద్..తాజాగా ”రామాయణ” పేరుతో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ,హిందీ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని 3డి సాంకేతిక పరిజ్ఞానంతో దాదాపు 1500 కోట్ల తో చిత్రీకరించనున్నారట. మూడు భాగాలలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘దంగల్’ డైరెక్టర్ నితీష్ తివారి, ‘మామ్’ మూవీ దర్శకుడు రవి ఉద్యావర్ కలిసి డైరెక్ట్ చేయనున్నారు.

ప్రస్తుతం ఇందులో నటించే తారాగణం గురించి చర్చలు జరుగుతున్నాయి. రాముడి పాత్రలో హృతిక్ రోషన్ నటించనుండగా.. అలాగే రావణుడి పాత్ర కోసం ప్రభాస్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇక సీత పాత్ర కోసం దీపికా పదుకొనేను తీసుకోవాలనుకున్నారని.. కానీ దీపిక కాదనవడంతో.. సీత పాత్ర కోసం శ్రద్ధాకపూర్ ని సంప్రదించారని తెలుస్తోంది. ఐతే శ్రద్ధా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. ఏకంగా 10 నుండి 12 కోట్లు వరకు అడిగిందట. ప్రస్తుతం అమ్మడితో చర్చలు జరుపుతున్నారట. అయితే రావణుడి పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ బాగుంటాడని.. ఎన్టీఆర్ ఒక్కడే ఆ పాత్రకు న్యాయం చేయగలడని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా ఈ తరంలో హిస్టారికల్ పాత్రలు చేయాలంటే ఒక్క ఎన్టీఆరే గుర్తుకురావడం నిజంగా విశేషమే.