దిల్‌రాజు హీరోలా ఉన్నాడ‌ట‌!

sruthi hasanనిర్మాత దిల్‌రాజుని శ్రుతి హాస‌న్ తెగ పొగిడేసింది. హీరో అంత అందంగా ఉన్నారంటూ కితాబిచ్చింది. ఎవ‌డు ప్రమోష‌న్‌లో భాగంగా శ్రుతిహాస‌న్ హైద‌రాబాద్ వ‌చ్చింది. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో 3 సినిమాలు చేశారు, ఆయ‌న్ని చూస్తే బోర్ కొట్టడం లేదా..? అని పాత్రికేయులు స‌ర‌దాగా ఓ ప్రశ్న సంధిస్తే, అంతే స‌ర‌దాగా స‌మాధానం ఇచ్చింది. ఆయ‌న్ని చూస్తే హీరోలా ఉన్నారు. ఇక బోర్ ఎందుకు కొడుతుంది? అని న‌వ్వేసింది. దాంతో దిల్‌రాజు ముసిముసిగా న‌వ్వేసుకొన్నారు. ప‌త్రిక‌ల వారికి భ‌లే హెడ్డింగ్ దొరికింది అని సంబ‌ర‌ప‌డిపోయారు. రేపో మాపో దిల్‌రాజు హీరోగా ఎంట్రీ ఇస్తే షాక్ తిన‌క్కర‌లేద్దు. మ‌రి అందులో శ్రుతి క‌థానాయిక‌గా న‌టిస్తుందా?? గెస్ చేయండి.