ఎన్టీఆర్ తో ప్రయోగ‌మే..

ntr-skumarమొత్తానికి సుకుమార్‌, ఎన్టీఆర్ ల సినిమా ఖాయ‌మైంది. ‘వ‌న్’ పై వ‌చ్చిన విమ‌ర్శల నేప‌థ్యంలో.. ఈ సినిమా ఉంటుందా?? లేదా?? అనే అనుమానాలు వ్యాపించాయి. అయితే చిత్రబృందం మాత్రం ఈ విష‌యంలో ఓ క్లారిటీ ఇచ్చేసింది. మేలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయ‌ని తెల్చింది. అయితే ఈ సినిమా ఏ త‌ర‌హాలో ఉంటుంద‌న్నది మాత్రం ఇంకా తెలీలేదు. సుకుమార్ ఎప్పట్లా ప్రయోగాలు చేస్తాడా?? లేదంటే ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టి లో ఉంచుకొని క‌థ రాస్తాడా..?? అనే సందిగ్థం నెల‌కొంది. ఈ విష‌య‌మై సుకుమార్‌ ని ఎన్టీఆర్ తెగ ట్యూన్ చేస్తున్నాడ‌ట‌. “నువ్వేం నీ పంథా మార్చుకోకు. ఇలాగే సినిమాలు తీస్తుండు. నీకు ఫుల్ స‌పోర్ట్ నేనిస్తా..“ అని ప్రోత్సహిస్తున్నాడ‌ట ఎన్టీఆర్‌. అంటే… ఈసారీ సుక్కు ప్రయోగ‌మే చేస్తాడ‌న్నమాట‌.