‘సూపర్ స్టార్’ సూపర్ స్టారే..


టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు సోషల్‌మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాల్లో మహేశ్‌ ఏకంగా 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా ఈ మూడు ప్లాట్‌ఫామ్‌లలో కోటిని క్రాస్‌ చేసిన ఏకైక సౌత్‌ ఇండియన్‌ హీరోగా మహేష్ బాబు సరికొత్త రికార్డు సృష్టించాడు.