ఓవర్సీస్ లో రికార్డు బ్రేక్ చేసిన సూర్య..

surya-24విబిన్న కథలకు కేరాఫ్ అడ్రెస్ అయిన సూర్య , మరోసారి ఓ విబిన్న టైం వాచ్ కథ తో ’24’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అయ్యాడు..ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లలో అదరగొట్టే వసూళ్ళను సాదిస్తూ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు..

ఒక ఓవర్సీస్ లో సరికొత్త రికార్డు సాదించాడు..యూఎస్ బాక్సాఫీస్ వద్ద 24 తెలుగు, తమిళ భాషల్లో కలుపుకొని ఇప్పటివరకూ 1.45 మిలియన్ డాలర్లు (9.74కోట్ల రూపాయలు) వసూలు చేసి సూర్య కెరియర్ లోనే అరుదయిన రికార్డు సాదించింది..ఈ రికార్డు తో సూర్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..ఈ చిత్రాన్ని దాదాపు 75 కోట్ల తో సూర్య నిర్మించడం విశేషం.