స్వచ్ఛ హైదరాబాద్ లో సినీ నటుల సందడి…

swatch-hyderabadతెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్ట త్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ హైదరాబాద్ రెండో రోజు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు దగ్గుపాటి వెంకటేష్, రానా, సందీప్ కిషన్, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దర్శకులు కె. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, సరేంద్రరెడ్డి, ఎన్. శంకర్తోపాటు వేణుమాధవ్, ఉత్తేజ్, తనికెళ్ల భరణి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిన్న హైదరాబాద్లోని పార్శిగుట్ట ప్రాంతంలో కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు అంతే కాక ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.