బాహుబలి కంటే సైరా ఎక్కువ..

మెగాస్టార్ చిరంజీవి నటించిన పిరియాడికల్ మూవీ సైరా నరసింహ రెడ్డి . ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

తాజాగా సెన్సార్ కార్య క్రమాలు పూర్తి కావడం తో చిత్ర నిడివి బయటకొచ్చింది. దాదాపు 2 గంటల 44నిమిషాలు సినిమా నిడివి ఉన్నట్లు తేలింది. అయితే ఈ నిడివి చూసి చాలామంది ఖంగారు పడుతున్నారు. సైరా పీరియాడిక్ మూవీ కావడంతో ఈ మాత్రం నిడివి చాలా అవసరమని చిత్ర యూనిట్ చెపుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్ర నిడివి 158 నిముషాలు కాగా, బాహుబలి 2 చిత్ర నిడివి 171 నిముషాలు. సైరా ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం 164నిమిషాల రన్ టైం కలిగి ఉంది. కాబట్టి సైరా రన్ టైం బాహుబలి కంటే ఎక్కువ, బాహుబలి 2కంటే తక్కువని చెపుతున్నారు.