సాహో అంత కూడా సైరా రాబట్టలేకపోయింది..

మెగా అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా చిత్రం..ప్లాప్ టాక్ తెచ్చుకున్న సాహో కలెక్షన్లంతా కూడా రాబట్టలేకపోవడం అభిమానులను బాగా నిరాశ కలిగిస్తుంది. చిరంజీవి – సురేందర్ రెడ్డి – రామ్ చరణ్ కలయికలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా చిత్రం భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీ గా ఈరోజు గ్రాండ్ గా విడుదల అయ్యింది.

కాగా యూఎస్ లో ఈ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం ఖాయమని అంత అనుకున్నారు. కానీ యూఎస్ ప్రీమియర్స్ విషయంలో సైరాకు నిరాశే మిగిలింది. యావరేజ్ గా నిలిచిన ‘సాహో’ చిత్రం స్థాయిలో కూడా ‘సైరా’ యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్ ను రాబట్టలేక పోయింది. కేవలం 8.57 లక్షల డాలర్లను మాత్రమే వసూళ్లు చేయగలిగింది. బాహుబలి 2 చిత్రం ప్రీమియర్ షోల ద్వారా 2.5 మిలియన్ డాలర్లను వసూళ్లు చేయగా.. అజ్ఞాతవాసి చిత్రం 1.52 మిలియన్ డాలర్లను రాబట్టి రెండవ స్థానంలో ఉంది. బాహుబలి చిత్రం 1.52 మిలియన్ డాలర్లను రాబట్టి మూడవ స్థానంలో ఉంది. ఓవరాల్ గా టాప్ 5 లో కూడా సైరా నిలువలేకపోవడం దారుణం.