‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ పక్క ఎన్నికల వేడి ముదురుతుంటే..మరోపక్క వర్మ తెరకెకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెలుగుదేశం నేతల్లో భయం పుట్టిస్తుంది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో నందమూరి తారకరామారావు రాజకీయ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్ ను కలిసి లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని , తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపివేయాలని కోరారు.

ఈ విషయాన్నీ వర్మ తన పేస్ బుక్ ద్వారా తెలియజేసాడు. మరి సినిమా విడుదల ఫై ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.