మన హీరోలకూ పద’మూడొ’చ్చింది

Tollywood heroes in 20132012కి ఘనంగా వీడ్కోలు చెప్పాం. కొత్త ఏడాదిని సంబరాలతో ఆహ్వానిస్తున్నాం. గడిచిన ఏడాది ఇప్పుడు చరిత్ర. సాధించిన విజయాల స్ఫూర్తి తెచ్చుకుని… ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని.. ముందుకు సాగిపోవాలి. విజయం, ఓటమి రెండూ వెంట రావెప్పుడూ. మళ్ళీ నిరూపించుకోవలసిందే. ఈ విషయం మన హీరోలకూ తెలుసు. అందుకే…. 2013 పై దృష్టి పెట్టారు. సరి కొత్త కధలతో, మహా కొత్త గెటప్ లతో అభిమానులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ప్రతీ హీరో చేతుల్లోనూ కావలసినన్ని సినిమాలు వున్నాయి. ఏడాదంతా సినిమాలతో బిజీగా గడపడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. 2012 మహేష్ బాబుదా? పవన్ కళ్యాణ్‌దా? అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టి… 2013లో విజృంభించేది ఎవరు? బాక్స్ ఆఫీసు రికార్డ్స్ సవరించే అవకాశం ఎవరిస్తారు..? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే సినిమాలే చెప్పాలి.

Ram-Charan-Teja-రామ్ చరణ్ ఈ ఏడాది బిజీ బిజీ. ఈ సంక్రాంతికి అందరికంటే ముందు “నాయక్‌” తో సినీ వినోదం పంచడానికి రెడీ అయిపోయారు. ‘రచ్చ’ విజయాన్ని తన ‘నాయక్’ తోనూ కొనసాగించాలని చరణ్ భావిస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ‘ఎవడు’ సినిమా కుడా ఈ ఏడాదే వస్తోంది. బాలీవుడ్ చిత్రం ‘జంజీర్’ సెట్స్ పై వుంది. త్రివిక్రమ్ దర్సకత్వంలో చరణ్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే… ఈ సినిమా కుడా ఈ ఏడాదే మొదలు కానుంది. చరణ్ సృష్టించిన ‘మగధీర’ రికార్డ్స్ ఇప్పటికీ పదిలంగా వున్నాయి. వాటిని చరణ్ ఈ ఏడాది అధిగమిస్తాడెమో చూడాలి.

Jr NTRయన్టీఆర్ ‘బాద్ షా’గా ముస్తాబు అవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది. కానీ వెనక్కి వెళ్ళింది. మార్చ్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా పూర్తి అవ్వగానే… హరీష్ శంకర్ తో సినిమా మొదలవుతుంది. మాస్, ఫ్యామిలీ… ఇద్దరికీ నచ్చే కధ యన్టీఆర్ కోసం హరీష్ సిద్ధం చేసారట. త్రివిక్రమ్ కూడా తారక్ కోసం… ఓ కధ రాసుకున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ పైకి వెళుతుంది. ‘దమ్ము’సినిమా తో నిరాశ పరిచిన తారక్… లెక్క సవరించాలంటే పంజా విసరాల్సిందే. అది ఈ ఏడాదే జరగాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Mahesh babuప్రిన్స్ రెండేళ్లుగా తన జోరు చూపిస్తున్నారు. సినిమా తరవాత సినిమా… అంటూ దూకుడు మీద వున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఈ సంక్రాంతికి వచ్చేస్తుంది. మరో వైపు సుకుమార్ సినిమా జరుగుతుంది. ఈ చిత్రాన్ని వేసవికి తీసుకొస్తారు. ‘శివం’ ఫిబ్రవరి లో మొదలవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే ‘కృష్ణ ముకుందా మురారి’ త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది. వీటితో పాటు ఎండార్స్మెంట్స్ కుడా వున్నాయి.

Tollywood heroes in 2013 Telugumirchi Nag Prabhas Allu Arjunరెండు సినిమాలతో సర్దుకు పోతున్న హీరోలూ వున్నారు. నాగార్జున ‘లవ్ స్టోరీ’, ‘భాయ్’ ఈ ఏడాది రాబోతున్నాయి. ‘త్రయం’ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. ప్రభాస్ ‘మిర్చి’ ఫిబ్రవరిలో వచ్చేస్తోంది. ఆ తరవాతి సినిమా కోసం రెండేళ్ళు ఆగాలి. ఎందుకంటే రాజమౌళి సినిమా పూర్తి కావాలంటే కనీసం రెండేళ్ళు పడుతుంది. పవన్ చేతిలో కూడా ఒకే సినిమా వుంది. త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ రొమాన్స్ చేస్తున్నారు. ఈ సినిమా వేసవికి విడుదల కానుంది. మరో వైపు సురేందర్ రెడ్డి దర్శకత్వం లో నటిస్తారు. వీటితో పాటు.. మరో భారీ సినిమా వుంది. ఈ చిత్రం తో తమిళ మార్కెట్ లోకి బన్నీ ఎంట్రీ ఇస్తున్నారు.

Balakrishnaహీరోలంతా బిజీగావుంటే అగ్ర కధానాయకుడు బాలకృష్ణ పరిస్థితి మాత్రం ఎందుకో భిన్నంగా వుంది. ఆయన నుంచి కొత్త సినిమా కబురేమీ వినరాలేదు. 2012 బాలయ్యకు సానుకూల ఫలితాలు తీసుకురాలేదు. ఈ సారి.. హిట్ సినిమాతోనే అభిమానుల ముందుకు రావాలి అని… ఆయన గట్టి పట్టుదలతో వున్నారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కధా చర్చల్లో పాల్గుంటున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే… ఆయన 100వ సినిమా గురించి తీపి కబురు కుడా కొన్ని రోజుల్లో వినొచ్చు.

Tollywood heroes in 2013మొత్తం మీద మన హీరోలకు మూడు కాదు పద’మూడు’ వచ్చింది. 12 నెలలూ.. షూటింగ్ లతో గడిపేయనున్నారు. ప్రతీ సీజన్ లోనూ ఓ భారీ చిత్రం మనకు వినోదం పంచబోతోంది. 80 ఏళ్ళ సినీ చరిత్ర ని తిరగరాసే దమ్ము…. ఈ కదానాయకులకు వుంది. ఆ అద్భుతం ఈ ఏడాది జరుగుతుందని, జరగాలని తెలుగు మిర్చి మనస్పూర్తిగా కోరుకుంటుంది.