టాలీవుడ్ ఉగాది కళకళ

ఉగాది బోలెడు కొత్త కబుర్లు మోసుకొచ్చింది. దాస్ కా ధమ్కీ, రంగమార్తాండ సినిమాలు విడుదలయ్యాయి. బాలకృష్ణ అనిల్ రావిపూడి ఫస్ట్ లుక్ తో వచ్చారు. కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ లుక్ ఇచ్చారు. అల్లరి నరేష్ కొత్త సినిమా ప్రారంభమైయింది. వెంకీ కుడుముల నితిన్ కొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. రవితేజ రావణాసుర నుంచి కొత్త పాట వచ్చింది.

నాగశౌర్య రంగబలి టైటిల్ అనౌన్స్ చేశారు. శ్రీవిష్ణు సామజవరగమన మే 18 న విడుదల చేస్తున్నట్లు చెప్పారు, అలాగే నాగ చైతన్య కస్టడీ నుంచి కొత్త పోస్టర్లు వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ విరూపక్ష గాండీవధారి అర్జున లుక్స్ తో సందడి చేశాడు. ఆశిష్ రెడ్డి ‘సెల్ఫిష్’ ఫస్ట్ లుక్ వచ్చింది. అనుష్క పుత్తడి బొమ్మ పాట తో సందడి చేసింది. మెగా పవర్ అనే మరో చిన్న సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. మొత్తానికి ఉగాది కొత్త సినిమా కబుర్లతో సందడి చేసింది.