ఉదయ్ కిరణ్ ఆ తప్పులు చేయడట

jai-sriramచాలాకాలం తరవాత ఉదయ్ కిరణ్ బొమ్మోకటి వస్తోంది. అదే ‘జై శ్రీరామ్’. యంగ్ బ్యాచ్ లో కాస్తో, కూస్తో హిట్లున్నవి ఉదయ్ కిరణ్ కే. వరుస విజయాలకు ‘శ్రీరామ్’ సినిమా బ్రేక్ ఇచ్చింది. యాక్షన్ ఇమేజ్ కోసం చేసిన ‘శ్రీరామ్’ బోల్తా పడడంతో ఉదయ్ కిరణ్ కేరీర్ తిరోగమనంలో వైపుసాగింది. ఇప్పుడు ‘జై శ్రీరామ్’ సినిమాతో మళ్లీ హిట్ల బాట పడతా.. అని నమ్మకంగా చెబుతున్నాడు. “నేను దర్శకుల హీరోని. అలా అనిపించుకోవాలంటే ఇష్టం. కెరీర్ ప్రారంభంలో తెలిసీ తెలియక కొన్ని తప్పులు చేశా. అవేమీ ఈసారి పునరావృతం చేయను. ‘జై శ్రీరామ్’పై చాలా నమ్మకం పెట్టుకొన్నా. నన్ను, నా శైలిని పూర్తిగా మార్చుకొని చేసిన సినిమా ఇది. తప్పకుండా ఆ మార్పు తెలుస్తుంది” అని ఘంటాపథంగా చెబుతున్నాడు. ‘జై శ్రీరామ్’ ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేష్మ కథానాయికగా నటించింది.