వీర లెవెల్ లో ‘వీరసింహారెడ్డి’ 100 డేస్ సెలబ్రేషన్స్


నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనిల మాసీయస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా విడుదలై వీర మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి వందరోజులు పూర్తికావస్తోంది. ఏప్రిల్ 21 తో ఈ సినిమా ఎనిమిది కేంద్రాలలో విజయవంతగా 100 రోజులు పూర్తి చేసుకోబోతుంది.

దీంతో చిత్ర నిర్మాతలు 100 డేస్ ఫంక్షన్ ని ఏప్రిల్ 23న గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్ ఎక్కడ నిర్వహించబోతున్నారు, ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది త్వరలోనే తెలియజేస్తాం అంటూ వెల్లడించారు. ఈ రోజుల్లో సినిమా వందరోజులు ఆడటం అరుదైన విషయం. ఈ అరుదైన రికార్డ్ ని ‘వీరసింహారెడ్డి’ అందుకుంది. కాగా బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 సినిమాలో నటిస్తున్నాడు.