రౌడీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

విజయ్ దేవరకొండ పుట్టిన రోజు ఈరోజు. 30 ఏళ్లు పూర్తి చేసుకుని.. 31లోకి వెళ్తున్నాడు. నాలుగేళ్ల కింద ఈయనెవరో కూడా ప్రేక్షకులకు తెలియదు. కానీ ఇప్పుడు ఇండియాలో టాప్ సెలబ్రిటీస్‌లో ఒకడిగా నిలిచాడు. 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి పోర్ట్స్ లిస్టులో టాప్ 30లో చోటు సంపాదించుకున్నాడు.

పెళ్లి చూపులు సినిమాలో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ అయిపోయాడు. గీత గోవిందం, టాక్సీ వాలా సినిమాలతో సూపర్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో ఫైటర్.. శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ డేట్స్ కోసం అగ్ర నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. మొత్తం మీద అతి తక్కువ టైం లోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న రౌడీ కి మరో సారి తెలుగుమిర్చి తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.