మనకు ఇష్టమైన దానికోసం పోరాటం చేయాల్సిందే : విజయ్

మనకు ఇష్టమైన దానికోసం పోరాటం చేయాల్సిందే అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. రష్మిక కథానాయిక. భరత్‌ కమ్మ దర్శకుడు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సి.వి.ఎం), యష్‌ రంగినేని నిర్మాతలు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరకర్త. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సంగీత విజయోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “‘మన జీవితాల్లో అందరం ఎవరి పోరాటం వాళ్లు చేస్తుంటాం. భయం వదిలేస్తే ఎవరు అడ్డుకున్నా జయము నీదేలే అని ఇందులో పాట ఉంటుంది. అది నేను నమ్మాను. అందుకే ఈ చిత్రం చేశా. ఈ సంగీతోత్సవం చేయాలనుకొన్నప్పుడు భయపడ్డా. కానీ దాన్ని వదిలేయడంతోనే ఈ వేడుక జరిగింది. బెంగళూరులో మొదలుపెట్టి ఆ తర్వాత కొచ్చి, చెన్నైల్లో వరుసగా ఈ వేడుకల్ని జరిపాం. ప్రతిచోటా ప్రేక్షకుల్ని చూస్తున్నప్పుడు ఇంత ప్రేమ ఇస్తున్నందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలా అనిపించింది” అన్నారు. ఈ వేడుకలో విజయ్-రస్మిక డ్యాన్స్ ఫర్ ఫామెన్స్ హైలైట్ గా నిలిచింది.