విజయ్ – రష్మిక మరోసారి..

విజయ్ దేవరకొండ – రష్మిక ల జోడి అంటే అభిమానులను పండగే..వీరిద్దరి కలయికలో వచ్చిన గీత గోవిందం చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో..తెరపై వీరిద్దరి జోడి ఎంత ముచ్చటగా ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ సినిమాలో జోడి కట్టారు. వీరిద్దరి జోడి కి మంచి మార్కులే పడినప్పటికీ , సినిమా కథ , కథనం బాగాలేకపోవడం తో సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జోడి కలవబోతున్నట్లు సమాచారం.

సుకుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ కి జోడిగా రష్మిక ను అనుకుంటున్నారట. ప్రస్తుతం సుకుమార్ చేస్తున్న పుష్ప లోను ఈమెనే హీరోయిన్. ఈమె నటన బాగా నచ్చి నెక్స్ట్ సినిమాలో కూడా ఈమెనే తీసుకోవాలని సుక్కు ఫిక్స్ అయ్యాడట.  శివ నిర్వాణతో కమిటైన సినిమాను విజయ్ దేవరకొండ పూర్తిచేసిన తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. అంటే వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.