సిక్స్ కొట్టడానికి ట్రై చేస్తా అంటున్న విజయ్..

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక లో విజయ్ బాగా ఎమోషనల్ గా మాట్లాడి అందరిని కట్టిపడేసాడు.

విజయ్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం 2016లో పెళ్లి చూపులు చిత్రంతో మీ ముందుకు లీడ్ యాక్టర్‌గా వచ్చా.. నాలుగేళ్లు అవుతుంది. ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇది నా తొమ్మిదో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈ నాలుగేళ్లలో చాలా చేశాం. హిట్లు కొట్టాం.. కొన్ని చేతి నుండి జారిపోయాయి. తమిళ్ సినిమా కూడా చేశా. ఈ జర్నీలో మీరు నేను ఏది చేసినా నాతో ఉన్నది మీరు. విజయ్ అంటే ఎవడో ఎవరికీ తెలియదు. అట్లాంటిది 2016 నుండి 2020 వరకూ నాకు తోడుగా ఉన్నారు.

మనం ఈ ఏడాది నుండి ఇంకా చాలా చేయబోతున్నాం. నేను ఏది చేయాలన్నా సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్‌ డబుల్‌లు నాకు ఓపిక ఉండదు. కొడితే స్టేడియం బయట బాల్ పడాలని బ్యాట్ ఊపుతా.. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, నోటా, డియర్ కామ్రేడ్ చేసినా ఇలా ప్రయోగాలు చేశాం. కొన్ని అనుకున్నట్టుగానే స్టేడియం బయట పడ్డాయి. మరికొన్ని బౌండరీ దగ్గర క్యాచ్‌లు పడ్డాయి. కాని భయం అయితే లేదు. ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా. ఇది నా లవ్ స్టోరీ అని మొన్న చెప్పా.. ఎందుకంటే నాకు అలా అనిపించింది. మనిషిగా మారుతున్నా.. టేస్ట్‌లు మారుతున్నాయి. నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్తున్నా. లాస్ట్ లవ్ స్టోరీ చేసినప్పుడు ఈసినిమాలో అన్నీ కవర్ చేయాలి. అలాంటప్పుడు మూడు రకాల రోల్స్ ప్లే చేశా. వాళ్ల ఆర్ధికస్తోమతలు.. నాలుగు రకాల ప్రేమికులు. ఇన్ని విచిత్రమైన రోల్స్ ఒకే సినిమాలో చేసే అవకాశం నాకు డైరెక్టర్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చారు.